Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. రాహుల్‌గాంధీ డిమాండ్
- ఢిల్లీని పట్టిపీడిస్తున్న కాలుష్యం
- రాహుల్‌గాంధీని కలిసిన నగర వాసులు
- పార్లమెంట్‌లో చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వాతావరణం మరింత దారుణంగా తయారైంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. శాశ్వతంగా ఆ దేశాల నుంచి వలసల నిలిపివేత
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఢిల్లీ వాసులు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఢిల్లీలో జీవించలేకపోతున్నామని వాపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనని కోరారు.
ఇది కూడా చదవండి: Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు
‘‘నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకటే చెప్పారు. బిడ్డలు విషపూరిత గాలిని పీల్చుకుంటున్నారని. నీరసించి పోవడమే కాకండా భయపడుతున్నారని చెప్పారు. ఆందోళనగా ఉంటున్నారని వాపోయారు. మోడీ జీ.. భారతదేశ పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరెలా మౌనంగా ఉండగల్గుతున్నారు? మీ ప్రభుత్వానికి ఎందుకు అత్యవసర ప్రణాళిక లేదు. జవాబుదారీతనం లేదా?’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని’’ పరిష్కరించడానికి దేశానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. ‘‘మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు- సాకులు, పరధ్యానాలు కాదు.’’ అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. నవంబర్ 30న ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.
Every mother I meet tells me the same thing: her child is growing up breathing toxic air. They are exhausted, scared and angry.
Modi ji, India’s children are choking in front of us. How can you stay silent? Why does your government show no urgency, no plan, no accountability?… pic.twitter.com/HR87tlHQ1f
— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2025
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!