Supreme Court: ఓటుకు నోటు కేసులో విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో విచారణ వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో.. ఓటుకు నోటు కేసులో విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.. కాగా, ఈ రోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వేసిన పిటిషన్ల జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ.. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఆర్కే..
Read Also: Telangana Elections 2023: ప్రచారంలో కౌశిక్‌రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్.. విచారణకు ఈసీ ఆదేశం!
అయితే, ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. దీంతో.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కాగా, ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఓవైపు.. విపక్ష నేత అయిన చంద్రబాబు, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మరోవైపు.. పాత కేసులను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.