CM YS Jagan: సఫాయి కార్మికుల కోసం క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వచ్ఛత ఉద్యమి యోజన కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు 100 మురుగుశుద్ధి వాహనాల అందజేశారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సఫాయి కార్మికులు వినియోగించే క్లీనింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు ఏపీ సీఎం.. ఇక, ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో కనివిని ఎరుగని రీతిలో చర్యలు చేపట్టింది. ఎంత వ్యయమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.