నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రేపటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఆన్ లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది
ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వారికి ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారంట చుట్టనున్నారు.. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి తిరుపతిలో జారీచేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు కేటాయించనుంది టీటీడీ.. తిరుపతిలో 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు.. రోజుకి 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించింది టీటీడీ..
Velampalli Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. సీట్ల మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయమనే చర్చ సాగుతోంది.. అంతే కాదు.. కొందరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా చాలా మందినిలో టెన్షన్ నెలకొంది.. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ […]