టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమన్న ఆయన.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.. అయితే, నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు.. అయితే, వారి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. పలు డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది..
2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
అంగన్వాడీల సమస్యలపై సచివాయలంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచామని గుర్తుచేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు రూ.2750 నగదును ఇస్తూ వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఆ పెన్షన్ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వైఎస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం మభ్యపెట్టడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం.. దైవభక్తి ఉన్న వైఎస్ జగన్ ఎన్నడూ చేయలేదన్నారు.