Mohan Babu: ప్రధానిపై మోహన్‌బాబు ప్రశంసలు.. మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కోటిహనుమాన్ చాలీసా తిరుపతిలో జరగడం మనందరి అదృష్టంగా పేర్కొన్నారు. ఈ రోజు నేను ఏమి మాట్లాడినా అతిశయోక్తి కాదన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు అన్నారు.. కులాలు అనేవి లేవు, తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారు.. కానీ, మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు మోహన్‌బాబు.
Read Also: Asaduddin Owaisi: మసీదులను రక్షించుకోవాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Also Read
ఎల్లప్పుడూ నరేంద్ర మోడీయే భారత ప్రధానిగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు మోహన్‌బాబు. మోడీ ప్రధాని కాక ముందే ఆయన్ని నేను ఫ్యామిలీతో కలిశాను అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మోడీ రెండు సార్లు విజయం సాధించారు. మళ్లీ విజయం సాధించ బోతున్నారు.. మూడో సారి ఆయన భారత ప్రధాని అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక, అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఒక చరిత్రగా అభివర్ణించారు.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం వచ్చిందని వెల్లడించారు మోహన్‌బాబు. కాగా, ఫ్యామిలీతో ప్రధాని నరేంద్ర మోడీని మోహన్‌బాబు కలిసిన విషయం విదితమే.. గతంలోనూ ఆయన ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించినా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ప్రధాని మోడీపై మోహన్‌బాబు ప్రశంసలు వెనుక ఏదైనా మతలబు ఉందా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?