Vishal : నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్.. ఆ డబ్బు తిరిగి కట్టాల్సిందే.. లేదంటే జైలుకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు మరియు నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో నడుస్తున్న రుణ వివాదానికి సంబంధించి కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు విధించిన రూ.10 కోట్ల డిపాజిట్‌కు గడువు పొడిగించాలని విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) కొట్టివేసింది.
Also Read : Exclusive : మహేశ్ బాబు – సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
2016లో ‘మరుదు’ (తెలుగులో ‘రాయుడు’) సినిమా నిర్మాణం కోసం విశాల్ గోపురం ఫిలిమ్స్ నుండి రూ.21.29 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పును తర్వాత లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. ఒప్పందం ప్రకారం, విశాల్ ఈ మొత్తాన్ని 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించారని, తమ అనుమతి లేకుండా తన సినిమాల హక్కులను ఇతరులకు విక్రయిస్తున్నారని లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి, వడ్డీతో కలిపి మొత్తం బాకీని చెల్లించాలని గతంలో తీర్పు ఇచ్చారు. దీనిపై విశాల్ అప్పీల్‌కు వెళ్లగా, మధ్యంతర స్టే కోసం కోర్టు రిజిస్ట్రార్ వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ద్విసభ్య ధర్మాసనం షరతు విధించింది. అయితే విశాల్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారని, డబ్బు సమీకరించడానికి మరో ఆరు వారాల గడువు కావాలని విశాల్ తరపు న్యాయవాది కోరారు. అయితే జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ కె. కుమరేష్ బాబులతో కూడిన ధర్మాసనం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇక గడువు పొడిగించలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో విశాల్‌పై ఆర్థికంగా మరియు న్యాయపరంగా మరింత ఒత్తిడి పెరిగింది. కోర్టు ఆదేశాలను పాటించని పక్షంలో లైకా ప్రొడక్షన్స్ తమ బకాయిల వసూలు కోసం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!