Chandrababu Helicopter: చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం..! రాంగ్ రూట్‌లోకి వెళ్లి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Helicopter: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు హెలికాప్టర్ అరకు ప్రయాణంలో గందరగోళం ఏర్పడింది.. ఏటీసీ క్లియరెన్స్ లభించకపోవడంతో హెలికాప్టర్‌ను వెనక్కి రప్పించారు అధికారులు.. అయితే, చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ కు – ఏటీసీకి సమాచార లోపం ఏర్పడడంతో ఈ పరిస్థితి వచ్చింది.. నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలో అరకుకు బయల్దేరి వెళ్లింది చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్.. అయితే, రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) హెచ్చరించింది.. దీంతో, హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించింది ఏటీసీ.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు ఏటీసీ అధికారులు.
Read Also: Ajith Vs Vijay: క్లాష్ ఆఫ్ టైటాన్స్ కి కోలీవుడ్ సిద్ధం… కొంచెంలో మిస్ అయ్యింది
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే, ఏటీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు అరకు వెళ్లారు.. హెలికాప్టర్ దిగి కారులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి . ఈ బహిరంగ సభకు టీడీపీ, జనసేన నేయకులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా, రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ స ఈఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అందులో భాగంగా నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ నాయకత్వం.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!