* నేడు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. ముస్తాబైన అయోధ్య.. మధ్యాహ్నం 12.29 నుంచి 12.30 వరకు ప్రాణప్రతిష్ట ముహూర్తం.. 1-2 గంటల మధ్య ప్రధాని మోడీ, మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఉపన్యాసాలు, అయోధ్య చేరుకుంటున్న అన్ని రాష్ట్రాల రామభక్తులు, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య
* నేపాల్: సీతమ్మవారి స్వస్థలం జనక్‌పూర్‌లో నేడు ప్రత్యేక పూజలు..
* చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు.. ‘జగనన్నకి చెబుదాం’ పేరిట ఆందోళన, వేతనాలు పెంచాలని డిమాండ్, అంగన్వాడీల ఆందోళనలపై ఇంటెలిజెన్స్ అలర్ట్.. జిల్లాల్లో ఎక్కడికక్కడ అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
* హైదరాబాద్: నేడు ధరణి కమిటీ మూడో సమావేశం.. సీసీఎల్ఏలో జరుగనున్న సమావేశం.. పరిష్కృత భూ సమస్యలపై దృష్టి
* బెజవాడలో అంగన్వాడీ వర్కర్ల అరెస్టుల పర్వం.. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయం నుంచే అరెస్టులు, ధర్నా చౌక్ శిబిరానికి నిన్న రాత్రే భారీగా చేరుకున్న అంగన్‌వాడీలు.. సుమారు వెయ్యి మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
* బాపట్ల : చీరాలలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర, హాజరుకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగాం సురేష్, మోపిదేవి వెంకటరమణ..
* ప్రకాశం : పొన్నలూరులో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అయోధ్యలో రామ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా తిరువీధి ఉత్సవం.. సాయంత్రం ఆలయంలో దీపోత్సవం.. కంభంలో అయోధ్య ప్రతిష్ట సందర్భంగా దేవాలయాల సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర..
* ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..
* ఒంగోలు పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మలిక గర్గ్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్న టీటీడీ.. రేపు ఆన్ లైన్ లో అంగప్రదక్షణం, శ్రీవాణి, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల
* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12:45 వరకు దర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ రామయం పారణం.. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమాని నిర్వహిస్తున్న టీటీడీ
* అమరావతి: ఇవాళ 2024 ఓటర్ల తుది జాబితా విడుదల.. ఎస్ఎస్ఆర్-2024ను విడుదల చేయనున్న ఏపీ సీఈఓ. మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ కానున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్ఎస్ఆర్ – 2024 జాబితా అందచేయనున్న ఎంకే మీనా.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అయోధ్య లో జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో శ్రీరామ భజనలు..
* ఆత్మకూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో విజయీ భవ యాత్రను నిర్వహించనున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* విజయవాడలో అంగన్వాడీల దీక్షలను భగ్నం చేసి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ పార్టీలు, ప్రజా సంఘాలను సంప్రదించి నిరసనలు తెలియజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపు
* నేడు మంత్రి చెల్లుబోయిన వేణు గారి కార్యక్రమాల షెడ్యూల్.. ఉదయం 7 గంటలకు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.. 10 గంటలకు పిడింగొయ్యి గ్రామంలోని ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం.. 11 గంటలకు హుకుంపేట రామాలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకి కాతేరు ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం
* అనంతపురం : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుంతకల్ పట్టణంలో శ్రీరామ భక్త మండలి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ.
* అనంతపురం : అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుత్తి కోటలోని అతి పురాతనమైన కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ర్యాలీ,
అన్నదానం కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : పరిగి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* అనంతపురం : నగరంలోని ఫంక్షన్ హాల్ లో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకరనారాయణ,శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజినేయులు పరిచయ కార్యక్రమం.
* అనంతపురం : ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా ప్రచురణ కార్యక్రమం ఉన్నందున నేడు జరగాల్సిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం రద్దు.
* అనంతపురం : రేపు ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్.. వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
* శ్రీ సత్యసాయి : అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ట సందర్బంగా మడకశిర పట్టణంలోని ఆలయాలలో రామభజనలు,బైక్ ర్యాలీలు.
* తిరుపతి: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తిరుచానూరులో భక్తి మండలి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ…
* శ్రీ సత్యసాయి : రాయితీలు , ప్రోత్సాహకాల కోసం హిందూపురంలో పట్టు రైతులు, రీలర్ల దీక్షలకు ఆరవరోజుకు చేరిక.
* హైదరాబాద్: నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యట.. అయోధ్య లో జరిగే రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు రావులపాలెంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కులాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం.. ఉదయం 11 గంటల నుండి
శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో రాబోయే ఎన్నికలపై రాజకీయ చర్చ. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై నిర్ణయాలు