ముందు విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తాను.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత..
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎప్పుడూ ఏదో విషయంలో సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. తనకు కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించినందుకు ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత.. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు.. ఇక, కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేయనున్నారట శ్వేత.
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు.
ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ..