* నేడు పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఉదయం 11 గంటలకు ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
* నేడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. రెండు రాష్ర్టాల నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ..
* హైదరాబాద్: గజ్వేల్ ఎమ్మెల్యేగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్
* ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమం..
* ప్రకాశం: దొనకొండలో వైఎస్ఆర్ అసర కార్యక్రమంలో పాల్గొననున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైసీపీ ఇంచార్జీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి..
* ఒంగోలు కలెక్టరేట్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు సహా జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహా ధర్నా..
* తూర్పుగోదావరి: నేటి నుంచి మరమ్మత్తు పనులు నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేత, బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా పది రోజులు పాటు మూసివేత.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో మరమ్మత్తు పనులు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం. పొదలకూరు మండలాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు, వెంకటగిరిలో పర్యటించనున్న నారా భువనేశ్వరి
* అనంతపురం : యాడికి మండలం గుడిపాడు, కుందనకోట, చింతలాయపల్లె గ్రామాలలో నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ చైతన్య బస్సు యాత్ర.
* అనంతపురం : నేటి నుంచి జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు. పట్టణంలో ర్యాలీ
* తిరుమల: ఎల్లుండి నుంచి మూడు రోజులు పాటు హిందు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్న టీటీడీ.. సదస్సుకు హజరవుతున్న 57 మంది పిఠాధిపతులు, మఠాధిపతులు.. ధర్మప్రచార కార్యక్రమాలను విసృతంగా నిర్వహించేందుకు మఠాధిపతులు, పిఠాధిపతులు సలహాలను స్వీకరించనున్న టీటీడీ
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఈనెల 29 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కొనసాగింపు.. అమలాపురం టౌన్, అమలాపురం తాలూకా, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, ఐ. పోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధిలో యాక్ట్ అమలు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిషేధం.
* పశ్చిమగోదావరి జిల్లా: నేడు భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన.. జిల్లా విస్తృస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పురంధేశ్వరి
* తిరుపతి: నేటి నుంచి జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు.
* కాకినాడ: నేడు కాకినాడలో జరిగే వారసత్వ సంపద సంరక్షణపై చర్చ కార్యక్రమంలో పాల్గొనున్న వాటర్ మేన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్
* విశాఖ: నేడు విశాఖ, అరకు, పాడేరులో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం. ఆదివాసీలకు ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు – ఆవశ్య కతపై చర్చ.. ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు
* ఏలూరు: ఈనెల 5వ తేదీన చింతలపూడిలో టీడీపీ “రా కదలిరా” బహిరంగ సభ.. హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు.
* విజయనగరం: నేడు రాజీవ్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా ఫైనల్ మ్యాచ్‌లు ..
* విశాఖ: నేడు జనసేన ఉత్తరాంధ్ర సమావేశం.. హాజరుకానున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులు
* విజయనగరం: సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోగాపురం ద్యానమందిరం లో నేడు ఉచిత కంటి పరీక్షలు..
* విజయనగరం: మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నేడు ధర్నా.. మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్.
* తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,635 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,553 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు
* నంద్యాల: నేడు శ్రీశైలానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. 9:30 గంటలకు హెలికాప్టర్ లో సున్నిపెంట చేరుకొని రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకోనున్న లోకేష్.. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న లోకేష్