ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్‌తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్‌తో జరిగే భేటీలో దీనిపై…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.