Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా జగన్‌ను అభిమానించేవారు కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు.. నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని ప్రకటించారు. 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను.. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా.. రెండుసార్లు విజయం సాధించాను.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను.. వైఎస్ జగన్ కోసం సైనికుడిలా పని చేస్తాను.. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు.
Read Also: RBI : ఆర్బీఐ కొత్త ప్లాన్.. ఆన్ లైన్ లావాదేవీలకు ఇకపై ఓటీపీ అవసరం లేదు
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
రేపు నరసరావుపేటకు వెళుతున్నా.. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే.. అంతా కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు అనిల్ కుమార్ యాదవ్.. ఈ ప్రాంతం (నెల్లూరు) నాకు అన్నీ ఇచ్చింది.. వీరి దీవెనల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా అన్నారు. నాకు ఎవరి మీదా కక్ష్య లేదన్న ఆయన.. నాకు ఎందరో సహకరించారు.. నెల్లూరు సిటీకి అభ్యర్థిగా మైనారిటీ కి వైఎస్ జగన్ అవకాశం కల్పించారు.. ఒకరిద్దరు నాయకులు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. పార్టీ ఏమీ బలహీన పడదు.. కొత్త వారిని తీసుకు వస్తాం.. నేత మారినప్పుడు కొందరు వెళ్లడం సహజమే అన్నారు. నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా.. జగనన్న నన్ను పోటీ చేయమని చెప్పారు.. ఎవరికీ దొరకని అవకాశం నాకు లభించిందని భావిస్తున్నాను అన్నారు. రేపు సాయంత్రం నరసరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను అని వెల్లడించారు.
Read Also: CM Revanth Reddy: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తాం..
ఇక, జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయి అన్నారు అనిల్ కుమార్ యాదవ్.. నాలుగున్నర ఏళ్లు జగన్ దేవుడు ఇలా కనిపించారు.. జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు.. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చింది.. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. సీఎం జగన్ ఏమి చేయలేదో చెప్పాలి? అని నిలదీశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని కృష్ణ మూర్తి కి కూడా చెప్పారు.. ఆయన కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మరోవైపు, టీడీపీ ఎంతమంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి.. ప్రకాశం.. నెల్లూరు.. తిరుపతి జిల్లాల్లో బీసీలలో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయన ను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు అని దుయ్యబట్టారు.. ప్రజలంతా చూస్తున్నారు.. 2024లో మళ్లీ వైఎస్ జగన్‌ను ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?