Dhurandhar 2 In Trouble : చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. దర్శకుడు ఆదిత్య ధర్ స్టూడియోపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ ధురంధర్ 2’ చిత్ర యూనిట్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఆగ్రహానికి గురైంది. షూటింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే కారణంతో దర్శకుడు ఆదిత్య ధర్ కు చెందిన ‘B62 స్టూడియోస్’ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు.
Also Read : Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
దక్షిణ ముంబైలోని చారిత్రాత్మకమైన ఫోర్ట్ (Fort) ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే, ఇక్కడి పాత కట్టడాలు మరియు జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని నిప్పు మరియు టపాసుల వాడకంపై నిషేధం ఉంది. అయినప్పటికీ, చిత్ర బృందం అనుమతి లేకుండా మంటలను ఉపయోగించి చిత్రీకరణ సాగించింది. గతంలోనే అధికారులు హెచ్చరించి జరిమానా విధించినా, ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి మళ్ళీ కాగడాలు వెలిగించి షూటింగ్ చేస్తూ అధికారులకు దొరికిపోయారు. ఈ వరుస ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన BMC, ఈ నిర్మాణ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ప్రతిపాదించింది. ఒకసారి బ్లాక్‌లిస్ట్‌లో పడితే, ఆ స్టూడియో భవిష్యత్తులో ముంబైలో ఎక్కడా షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా లోకేషన్లు బుక్ చేసుకోవడానికి వీలుండదు. దీనితో పాటు, అనుమతి లేకుండా బిల్డింగ్ టెర్రస్‌లపై షూటింగ్ చేయడం, అక్రమ పరికరాలను వాడటం వంటి కారణాల వల్ల భారీగా జరిమానాలు కూడా విధించారు. ముంబై లాంటి నగరాల్లో సినిమా షూటింగ్‌ల పేరుతో ప్రజల భద్రతను పణంగా పెడితే ఎంతటి పెద్ద నిర్మాణ సంస్థ అయినా చట్టం ముందు సమానమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ‘ ధురంధర్ 2’ టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని ఇప్పడు షూటింగ్ కు బబ్రేక్ వస్తే రిలీజ్ కూడా వాయిదా వేసే ఛాన్స్ ఉంటుందని ముంబై ట్రేడ్ టాక్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!