-
Help To The Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రండి.. సీఎం పిలుపు
వరద బాధితులను ఆదుకనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. -
Rain Alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది.. -
Vijayawada Floods: వరద బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం.. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చర్యలు..
బెజవాడలో వరదలపైనే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాత్రి గంటన్నర సేపు సింగ్ నగర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు.. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు బాధితులు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు వివరించారు వరద బాధితులు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.. -
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి తగ్గుతోన్న వరద.. బెజవాడకు ముప్పు తప్పినట్టేనా..?
బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్‌ఫ్లో.. -
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 9 PM -
Heavy Rains and Floods in AP: ఏపీలో 19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతిచెందారు.. ఇద్దరు గల్లంతు అయినట్టు పేర్కొంది.. ఇక, 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని.. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందని వెల్లడించింది. -
Vijayawada – Hyderabad: ప్రయాణికులకు ఉపశమనం.. విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలకు లైన్ క్లియర్
విజయవాడ-హైదరాబాద్ రూట్లో రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఐతవరం దగ్గర హైవే పై చేరిన వరద నీరు తగ్గటంతో వాహనాలను అనుమతి ఇస్తున్నారు అధికారులు.. అయితే.. హైవేపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటిస్తున్నారు.. -
Gannavaram Airport: వర్షాలు, వరదల ఎఫెక్ట్.. గవన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీ..
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో... గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. -
Kanakadurga Flyover: పార్కింగ్ స్పాట్‌గా మారిన బెజవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్..
కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు చూస్తున్న బెజవాడ వాసులు ఇప్పుడు తమ వస్తువులను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.. లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్లను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.. ఇప్పటికే వందలాది కార్లు.. ఇతర వాహనాలు నీటమునిగి పోగా.. మిగతా వారు తమ కార్లను, వాహనానుల కాపాడుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.. అయితే, ఇప్పుడు బెజవాడ వాసులకు దుర్గగుడి ఫ్లైఓవర్ పార్కింగ్ స్పాట్‌గా మారిపోయింది.. -
Minister Nimmala Ramanaidu: కృష్ణా నదిలో ఇదే రికార్డు ఫ్లడ్.. అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..
అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కరకట్ట దగ్గర అవుట్ స్లూయుజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అన్నారు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!