Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
- కోహ్లీకి అరుదైన రికార్డు అవకాశం
- SENA దేశాలన్నింటిలో వన్డేల్లో 50కి పైగా సగటు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. నవంబర్ 4 నుండి న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ పరుగుల వరద పారిస్తే సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అదేంటంటే.. SENA దేశాలైన సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వన్డే క్రికెట్లో 50కి పైగా సగటు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్ కోహ్లీకి ఉంది.
వన్డేల్లో సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ 76.38 సగటుతో పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌లో అతడి సగటు 51.48గా ఉంది. అలాగే ఆస్ట్రేలియాలో 50.03గా ఉండగా న్యూజిలాండ్‌లో మాత్రం కోహ్లీ సగటు ప్రస్తుతం 49.66గా ఉంది. దీంతో రాబోయే ఐదు వన్డేల సిరీస్‌లో ఈ సగటును 50కి పైగా తీసుకెళ్తే ఈ అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా కోహ్లీ రికార్డ్ సాధిస్తాడు. అయితే న్యూజిలాండ్‌లో తన వన్డే సగటును 50కి పైగా తీసుకెళ్లేందుకు కోహ్లీ ముందు పలు అవకాశాలు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసి ఐదుసార్లు ఔటైతే సిరీస్‌లో మొత్తం 254 పరుగులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్‌లో అతడి వన్డే సగటు 50+ మార్కును చేరుకుంటుంది.
Also Read
- Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
- Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
ఒకవేళ 5 మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు మాత్రమే ఔటై, ఒకసారి నాటౌట్‌గా నిలిస్తే మొత్తం 204 పరుగులు చేస్తే సరిపోతుంది. అలాగే మూడు మ్యాచ్‌ల్లో ఔటై, రెండుసార్లు నాటౌట్‌గా నిలిస్తే 154 పరుగులు చేసినా న్యూజిలాండ్ గడ్డపై అతడి వన్డే సగటు 50కి పైగా చేరుతుంది. తద్వారా SENA దేశాలన్నింటిలోనూ 50కి పైగా వన్డే సగటు కలిగిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. వన్డే క్రికెట్లో ఇప్పటికే 15 వేలకుపైగా పరుగులు సాధించిన కోహ్లీ కెరీర్ సగటు 58.79గా ఉంది. 94.37 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన అతడి ఖాతాలో 55 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ తనదైన ముద్ర వేస్తే కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ప్రపంచ రికార్డు చేరనుంది. చూడాలి మరి కోహ్లీ ఈ గోల్డెన్ ఛాన్స్ ను అందిపుచ్చుకుంటాడో లేదో మరి..! న్యూజిలాండ్ సిరీస్ ఈ నెల 22 నుండి మొదట 5 టీ20 లతో ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!