-
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 9 PM -
Deputy CM Pawan Kalyan: అందుకే నేను ఫీల్డ్‌లోకి రాలేదు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం..
సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్‌లోకి రాలేదని స్పష్టం చేశారు.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను.. కానీ, అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారు.. ఇది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.. ఇంత విపత్తు సమయంలో నేను సాయపడాలి.. కానీ, అదనపు బరువు కాకూడదు.. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. -
Vijayawada Floods: సురక్షిత ప్రాంతాలకు 154 మంది గర్భిణులు.. అత్యవసర కిట్లు పంపిణీ..
తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని చేపట్టిందన్నారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందించిందన్నారు. -
CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు.. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా..
ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది.. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు.. దాదాపు ఆరు గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో తిరిగారు.. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరిగాల్సి వచ్చింది.. -
YS Jagan Donation For Flood Victims: వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్ జగన్..
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. -
CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!
మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా... పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు. -
Vijayawada Floods: నీరు తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టిన సర్కార్..
విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ. -
RK Roja: విజయవాడ ప్రజల కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది.. మంత్రులు ఏం చేస్తున్నారు..?
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు.. -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 5 PM -
Budameru Canal: తెగిన బుడమేరు కాలువ కట్ట.. ఎన్‌హెచ్ 16పైకి వరద నీరు..
కృష్ణా జిల్లా గన్నవరంలో గూడవల్లి వద్ద బుడమేరు కాలువ కట్ట తెగిపోయింది.. దీంతో.. బుడమేరు కాలువ నుంచి జాతీయ రహదారి 16పైకి వరద నీరు చేరుతుంది.. నిడమానూరు నుండి గూడవల్లి వరకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోయింది..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!