Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivendula Tension: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఇళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు కలకలం రేపాయి. ఈ ఘటనలతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో 30వ వార్డుకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన నిరంజన్‌రెడ్డి ఇంటి సమీపంలో రెండు లారీలను దుండగులు దగ్ధం చేశారు.. అలాగే మరో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి అంజనప్ప ఇంటి వద్ద ద్విచక్ర వాహనాన్ని కూడా తగులబెట్టారు.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వైసీపీ అభ్యర్థులను బెదిరించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందులలో వరుసగా వాహనాలు దగ్ధం కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, ఈ ఘటనలకు పాల్పడిన వారి వివరాలు, ఘటనల వెనుక ఉన్న కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Also Read
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
తాజావార్తలు
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
-
Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
-
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
-
Astrology: అక్టోబర్ 21 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!