Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- న్యూయార్క్‌లో నవరాత్రి వేడుకలు
- భారతీయులతో కలిసి గర్బా ఆడిన జోహ్రాన్ మమ్దానీ
- పూజారి ఆశీర్వాదం తీసుకున్న న్యూయార్క్ మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ భారతీయ సమాజంతో కలిసి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ గుజరాతీ జానపద నృత్యమైన గర్బా ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లటి సూట్ వేసుకుని, సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా గర్బా ఆడుతూ కనిపించారు. గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం మమ్దానీ ఓ ఆలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ పూజారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
నవరాత్రి శుభాకాంక్షలు
నృత్య వేడుకల్లో పాల్గొనడమే కాకుండా.. మమ్దానీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదిక ద్వారా హిందూ సమాజానికి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు, సంప్రదాయాల వైవిధ్యాన్ని తన సందేశంలో ప్రస్తావించారు. దుర్గాపూజ, దసరా, దశైన్, నవరాత్రి వంటి పండుగలతో పాటు సిందూర్ ఖేలా, గోలు బొమ్మల అలంకరణ వంటి ఆచారాలను గుర్తుచేశారు.
Also Read
- Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
“ఈ వారం మన హిందూ పొరుగువారు దుర్గాదేవిని ఆరాధిస్తూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. గర్బా నృత్యాలు చేస్తారు. సిందూర్ ఖేలా ద్వారా దుర్గాదేవిని పూజిస్తారు. పెద్దల నుంచి తిలకం (టికా) స్వీకరిస్తారు. తమ ఇళ్లలో గోలు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఇలా ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు. మీ కుటుంబం ఈ పండుగను దుర్గాపూజ, దశైన్, దసరా లేదా నవరాత్రి అని ఏ పేరుతో పిలిచినా.. ఈ పండుగ ఆత్మపరిశీలనకు, నూతన ఆరంభాలకు నాంది కావాలని కోరుకుంటున్నాను” అని మమ్దానీ తన పోస్టులో పేర్కొన్నారు.
భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్‌లోని దక్షిణాసియా సమాజానికి చెందిన పలు సాంస్కృతిక వేడుకల్లో గతంలోనూ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి దీపావళి, రక్షాబంధన్ వంటి పండుగలను కూడా జరుపుకున్నారు. న్యూయార్క్ నగరానికి తొలి దక్షిణాసియా సంతతికి చెందిన, భారతీయ అమెరికన్, ముస్లిం మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్, ఉగాండాకు చెందిన విద్యావేత్త మహమూద్ మమ్దానీ ఆయన తల్లిదండ్రులు. ముస్లిం, హిందూ సంప్రదాయాల మధ్య పెరగడం తన విలువలు, ఆలోచనా విధానంపై ప్రభావం చూపిందని మమ్దానీ గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
Zohran Mamdani is playing garba ❤️
A right winger’s worst nightmare is that people might actually coexist without asking their permission. 😂 https://t.co/V9FhmSrKWb
— aree_shuklajii (@th_anonymouse) October 20, 2026
This week, our Hindu neighbors celebrate the Goddess Durga during the festival of Navaratri.
Our neighbors will dance Garba, venerate the Goddess Durga with Sindur Khela, receive Tika from elders, set up Golu in their homes, and so much more.
Whether your family calls it Durga Puja, Dashain, Dussehra, or Navratri, may this festival mark a season of reflection and renewal.
— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) October 14, 2026
తాజావార్తలు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
-
Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
-
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!