త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్రెడ్డి..