Srikalahasti temple: శ్రీకాళహస్తి ఆలయంలో డ్రోన్ కలకలం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikalahasti temple: శివరాత్రి సమీపిస్తోన్న వేళ.. శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది.. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు.. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ.. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆలయంపై డ్రోన్ ఎగరవేసినవారు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చే జీఎన్.. మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత శనివారం రాత్రి శ్రీకాళహస్తికి చేరుకున్నారు.. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో దిగిపోయిన భక్తులు.. ఆ తర్వాత డ్రోన్ ఎగరవేశారు.
Read Also: PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఆలయ పరిసరాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.. ఇక, వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించినట్టుగా తెలుస్తుండగా.. తాము దిగిన గెస్ట్‌హౌస్ పైనుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి సమయంలో.. ప్రధాన ఆలయంపైకి డ్రోన్ ఎగరవేశారు.. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత డ్రోన్‌ను వెంబడించి యువకులను పట్టుకున్నారు. కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో డ్రోన్ కెమెరాల వినియోగంపై ఆంక్షలు ఉన్నా.. పలు సార్లు డ్రోన్‌లు ఎగరవేస్తూ పోలీసులకు చిక్కిన సందర్భాలు లేకపోలేదు.. కొన్నిసార్లు సెక్యూరిటీ వైఫల్యంపై కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!