8 మంది రెబల్ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ రెబల్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లపై ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్.. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు.. ఇక, వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ఈ రోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో ఈ మీటింగ్ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పం కు తీసుకురావడం ఎంతో సంతోషం.. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించల్సిన సందర్భం.. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు.. నేను ఇది వరకు ఇచ్చిన…