Minister Peddireddy Ramachandra reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తాం అన్నారు. ఇందుకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు..
Read Also: Megastar Chiranjeevi : మెగాస్టారా మజాకా.. చిరంజీవి పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!
ఇక, రాష్ట్రంలో మొత్తం 21 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. ఈ నెల 27వ తేదీన ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో సమావేశం నిర్వహిస్తాం అన్నారు.. ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల భారీగా సిద్దం సభలు నిర్వహించాం.. ఆ నాలుగు ప్రాంతాలు మినహాయించి మిగిలిన 21 జిల్లాలో సభలు జరుగుతాయన్నారు. సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సిద్ధం సభలతో కార్యకర్తలు జోష్ లో ఉన్నారని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ప్రచారంలో దూసుకుపోతోంది.. అయితే, ప్రతిపక్ష కూటమి మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించినా.. ఇంకా కొన్ని స్థానాలు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. టీడీపీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. బీజేపీ, జనసేన స్థానాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.