ఈ రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం.
పెన్షన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేపటి నుంచి టైటాలింగ్ చట్టం అమల్లోకి వస్తుందనీ, ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు గోరంట్ల బుచ్చియ్యచౌదరి
సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల ఆస్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.