AP CM and Deputy CM: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మంత్రివర్గంలోని నా సహచరులకు శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా వారికి నా అభినందనలు అని పేర్కొన్నారు.. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా పాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని నాకు నమ్మకం ఉందన్నారు.. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు సీఎం చంద్రబాబు.
Read Also: TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
కాగా, జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మిత్ర పక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వశాఖలు కేటాయించారు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు.. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చిన చంద్రబాబు.. ఇక, 2019–24 మధ్య కాలంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఇప్పుడు కేబినెట్‌లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు చంద్రబబు.. పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.. చంద్రబాబు పెట్ సబ్జెక్ట్ టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు ఏపీ సీఎం.. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.