విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అమర్నాథ్
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం - పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు.
నేటితో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది.. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.
తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.