ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు అని గుర్తుచేశారు
తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ను ఆశీర్వదించారు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు. ఇక, కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు వివిధ శాఖల అధికారులు..
ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. దేశానికి మోడీ ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు.. యావత్ దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.. ఇక, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్‌గా మారిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. గుడ్‌బై చెప్పారు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు రావెల కిషోర్‌బాబు..
ప్రొద్దుటూరు వాసుల ప్రజాతీర్పును గౌరవిస్తాను అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా ప్రజాలకోసమే పాలన చేశా.. ఉద్యోగస్తుల విషయంలో వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వచ్చాను.. ప్రతీ ఉద్యోగస్తులకు నా కృతజ్ఞతలు అన్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా.. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 04 లక్షల 21 వేల 906 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.