రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. జూన్ 5 నుంచి 7 వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం..
సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగితేలారు.. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్తే ఆ మీడియేటర్ కాస్త అడ్రస్ లేకుండా పోయాడు.
ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు..
సోషల్ మీడియా వేదికగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి.
టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది.. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.