ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సిట్. రెండు వాల్యూముల్లో సిట్ నివేదిక సమర్పించారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు.. తాము గుర్తించిన అంశాలతో పాటు.. తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూములో తొమ్మది ఛాప్టర్లల్లో తమ అబ్జరవ్వేషన్లను ఉంచిన సిట్. రెండో ఛాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగులను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది.
పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా వరుస విజయాలు సాధించారు కేశినేని నాని. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగినా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయంతో తర్వాత అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకు న్నట్టు కేశినేని నాని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి.
బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది.. ఇక, ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు.. వీఐపీలు పెద్ద సంఖ్యలు తరలిరానున్న నేపథ్యంలో.. ప్రముఖుల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.