లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం... అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు..
ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి కొడాలి నాని.. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
ఈ రోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.. ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎస్ నీరభ్ కుమార్..
మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపార్తవేత్త రామోజీరావు కన్నుమూశారు.. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది.. ఇక, రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. రామోజీ రావు మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు