Hand Casting: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి.. ఆ భర్త చేసిన పని అందరి హృదయాలను కదిలించింది..
- ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి..
- భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేయించిన భర్త..
- భార్య.. కూతురు.. తన హ్యాండ్ తో హ్యాండ్ కాస్టింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hand Casting: భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి.. అప్పుడే ఆ కాపురం పచ్చగా ఉంటుందని చెబుతారు.. భర్తకి భార్య బలం కావాలి.. కానీ, బలహీన కాకూడదు అంటారు.. అయితే, ఓ వ్యక్తి.. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమలో పడడం కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వారి బంధం ఎంతో అనోత్యంగా సాగింది.. వారి దాంపత్య జీవితంతో ఓ కూతురు కూడా పుట్టింది.. కానీ, విధి చాలా విచిత్రమైనది.. ఆ ఇల్లులను దూరం చేసింది.. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక.. జీవచ్ఛవంలా మారిన ఆ భర్త.. తన భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేయించి తన ప్రేమను చాటుకున్నాడు.
Read Also: Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్‌లోనే కార్లోస్ అల్కరాజ్కు ఎదురుదెబ్బ..
Also Read
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
- Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు. అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.. అయితే ఆనందంగా సాగుతున్న అశోక్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మృతి చెందడంతో అశోక్ తట్టుకోలేకపోయాడు. భార్య గుర్తుగా తన చేయి, తన కూతురు చేయి, చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి.. తన గుర్తుగా పెట్టుకున్నాడు. భార్య మృతితో అశోక్ జీవచ్చావం లా మారిపోయాడు. పెళ్లైన 16 ఏళ్లకే తన భార్యను కోల్పోయిన భర్త ఆవేదనను చూసి బంధువులు కంటతడి పెట్టారు. ఇక, భార్య గుర్తుకు తాను తయారు చేయించిన హ్యాండ్ కాస్టింగ్ అందరి హృదయాలను కదిలిస్తోంది.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!