Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత… బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు.. తనను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వేడుకున్నారు.. ఇక, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తితో స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారతశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. కవితను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేశారు.. ఇలా.. కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Jaishankar : తూర్పు లడఖ్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? మంత్రి జైశంకర్ ఏమన్నారంటే ?
ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లింది కవిత.. కానీ, పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురయినట్లు వీడియో ద్వారా వెల్లడించింది.. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వీడియో ద్వారా మొరపెట్టుకుంది.. ఇక, తక్షణమే స్పందించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. ప్రవాసంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో సంప్రదింపులు జరిపారు.. కవితను తన స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. నిన్న ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఏపీ ఎన్‌ఆర్‌టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు స్పందించిన ఏపీ ఎన్నార్టీ 24 గంటల అత్యవసర విభాగం కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళిని ఫోన్ ద్వారా సంప్రదించింది.. మురళి తోపాటు అక్కడే ఉన్న రషీదా బేగం అనే ప్రవాసాంధ్ర మహిళ ఇరువురు కలిసి కవిత ఆశ్రయం పొందిన ప్రాంతానికి వెళ్లి, ఆవిడను సురక్షితంగా దేశానికి తిరిగి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. గతరాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత ఈరోజు ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది.. ఈ విషయంపై స్పందించిన కవిత భర్త వెంకటేశ్వర్లు తాము ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశాలకు తన భార్య వెళ్ళిందని, ఆ పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో తాను తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. చివరి ఆశగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించడం, ఆయన తక్షణమే స్పందించడంతో స్వదేశానికి తిరిగి తన భార్య వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు..