Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు పవన్ కల్యాణ్.. అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
- 'ప్రాయశ్చిత్త దీక్ష' చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన దీక్ష విరమణ..
- నడకమార్గంలో తిరుమల చేరుకోనున్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Deeksha: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన విషయం విదితమే.. అయితే, తిరుమలలోనే దీక్ష విరమించేందుకు సిద్ధం అవుతున్నారు పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న ఆయన.. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.
Read Also: Hanuman Chalisa: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే సిరి సంపదలు..
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి రావడంతో.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమించనున్నారు.. 2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు పవన్ కల్యాణ్.. ఇక, 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చర్చగా మారగా.. దీక్ష విరమించిన తర్వాత నిర్వహించే వారాహి సభ వేదికగా.. గత ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..