Magunta Parvathamma Passed Away: మాగుంట కుటుంబంలో విషాదం.. మాగుంట పార్వతమ్మ కన్నుమూత..
- మాగుంట కుటుంబంలో విషాదం..
- మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూత..
- ఒంగోలు ఎంపీగా.. కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన పార్వతమ్మ..
- చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Parvathamma Passed Away: టీడీపీ నేత, ఒంగోలు లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు.. దీంతో ఎంపీ మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. కాగా, మాగుంట పార్వతమ్మ కావలి శాసనభ్యురాలిగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా.. అందరని ఆదుకునే మనిషిగా గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలే మాగుంట సుబ్బారామిరెడ్డి కుమారుడు కన్నుమూశాడు.. ఇప్పుడు మాగుంట పార్వతమ్మ చనిపోవడంతో.. ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించి.. విషాదం నెలకొంది..
Read Also: IND vs BAN: చెపాక్‌లో ఎన్నడూ చూడని దృశ్యాలు.. మరి కాన్పూర్ పిచ్ సంగతేంటి?
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
కాగా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించారు పార్వతమ్మ.. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఇక, 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో పార్వతమ్మ వివాహం జరిగింది.. 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.. మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అయితే, 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు..
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!