అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలు నిండుకుండలా మారాయి.. ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం లేదు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్‌ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట.
ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు.
విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..