నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.
ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని…
బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.. నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలకు దిగింది సర్కార్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీగా ఉన్న అతుల్ భట్ను విధుల నుంచి తప్పించింది.. ఆయన రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.. పిఠాపురంలోని జగనన్న కాలనీ, సూరంపేట వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..