Cyclone Dana: తీరం వైపు దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- తీరం వైపు దూసుకొస్తున్న దానా తుఫాన్..
- తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తుఫాన్..
- రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం..
- గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Dana: తీరం వైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ‘దానా’ తుఫాన్.. రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది.. ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిలో మీటర్లు.. సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలో మీటర్లు మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిలో మీటర్ల దూరంలో దానా తుఫాన్ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రేపు రాత్రి నుంచి 100-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Read Also: Bagheera : ప్రశాంత్ నీల్ నన్ను చాలా బలంగా నమ్మారు : శ్రీమురళి
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ఇక, ఈ సమయంలో భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు అని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్.. ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్ (ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి. కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.. మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి అని సూచించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ..
Read Also: Bagheera : ప్రశాంత్ నీల్ నన్ను చాలా బలంగా నమ్మారు : శ్రీమురళి
మరోవైపు.. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.. వాతావరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కొనసాగుతుందన్నారు.. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారుతుందన్న ఆయన.. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుఫాన్ కదులుతోందన్నారు.. 25వ తేదీన ఉదయం పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య భితార్కానికా మరియు ధమ్రా సమీపంలో తీరం దాటే ఆవకాశం ఉందని.. ప్రస్తుతానికి పారాదీప్ 520 కిమీ., సాగర్ ఐలాండ్స్ కు 600 కిమీ.. ఖేపుపరాకి 610 కిమీ దూరంలో దానా తుఫాన్ కేంద్రీకృతమైందని తెలిపారు.. ఇక, అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశాం.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్..
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!