తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే గరుడ వాహన సేవను రేపు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచే తిరుమలలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్ ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు సైతం అనుమతి నిలిపివేశారు.. అయితే.. రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు,…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు శ్రీకారం చుట్టింది.. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగారు టీటీడీ ఈవో శ్యామలరావు.
విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం వెలుగుచూసింది.. విదేశాల్లో స్థిరపడ్డ, బాగా సంపాదించిన మగవాళ్లే ఆమె టార్గెట్ కాగా.. సోషల్ మీడియా ద్వారా ఎన్నారైలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్లో పెట్టడం.. అవసరం అయితే.. వీడియో కాల్స్ కూడా చేయడం.. ఆమె దినచర్య. అయితే, ఆమె మొహంలో పడితే అంతే.. వాళ్ల దగ్గర నుంచి దొరికినంత దోచుకుని.. నిండా ముంచేయడంలో ఆమె దిట్ట..
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు కాకినాడ కస్టమ్స్ అధికారులు.. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా.. పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.
ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. ఇక, 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.