* హైదరాబాద్: ఈ రోజు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న విద్యాశాఖ.. జనవరిలో టెట్ ఎగ్జామ్.. జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్.. ఈ ఏడాది ఇప్పటికే ఒక టెట్ నిర్వహించిన విద్యా శాఖ..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో డీఆర్సీ సమావేశం, హాజరుకానున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.. పలు కీలక అంశాలపై ఇంఛార్జ్ మంత్రి ఆనం నేతృత్వంలో సమీక్ష..
* ప్రకాశం : ఇవాళ్టి నుంచి ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలో 9వ తేదీ వరకూ భద్రతా వారోత్సవాలు.. హాజరుకానున్న రాష్ట్ర స్థాయి అధికారులు..
* ప్రకాశం : రేపు ఒంగోలులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఇంచార్జుల సమావేశం, హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి..
* ఉమ్మడి గుంటూరు జిల్లాలో కార్తీక సోమవారం సందడి.. వేకువ జామునే శైవ క్షేత్రాలలో భక్తుల పూజలు.. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం, కోటప్ప కొండ క్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు..
* కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా అమరావతి , కృష్ణా నది తీరంలో దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న మహిళలు..
* కర్నూలు: నేడు కప్పట్రాళ్ళలో కీలక సమావేశం.. యురేనియం పరీక్షలపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నేడు ప్రజలతో అధికారులు ముఖాముఖి.. సమావేశానికి కప్పట్రాళ్ల, సమీప గ్రామాల ప్రజలకు ఆహ్వానం, ప్రజలతో చర్చించనున్న యురేనియం శాస్త్రవేత్తల బృందం, ఫారెస్ట్ అధికారులు, ఆర్డీవో.. ప్రజల ఆందోళనపై అనుమానాలు నివృత్తి చేయనున్న అధికారులు
* కర్నూలు: నేడు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. టీడీపీ ఆఫీసులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న రామానాయుడు.. కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు ఆఫీస్ లో ఎంపీ తో మంత్రి నిమ్మలసమావేశం.. కూటమి పార్టీ నేతలతో సమావేశం కానున్న మంత్రి నిమ్మల
* కర్నూలు: నేడు డీడీఆర్‌సీ సమావేశం.. పాల్గొననున్న మంత్రులు నిమ్మల రామానాయుడు, టిజి భరత్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడుతున్న స్థాన ఘట్టాలు.. కార్తీక సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు.. గోదావరి నదిలో వేలాదిగా విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ముట్టడి.. ఐటీడీఏ పరిధిలోని 100 శాతం ఉద్యోగాలు స్థానిక ఆది వాసి నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ ..
* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాలు.. ఉదయం 11 గంటలకు కడియం మండలం, కడియపులంక గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 12కి నిడదవోలు రూరల్ మండలం, సమిశ్రగూడెం గ్రామంలో సీయోను ప్రార్థన మందిరం నందు మూలరాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారు. 2 గంటలకు పెరవలి మండలం, కాపవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 5:30కి కొవ్వూరు గోస్పద క్షేత్రం నందు గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు నిడదవోలు పట్టణం నందు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
* కాకినాడ: నేడు పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం.. గొల్లప్రోలులో ప్రెస్ మీట్ నిర్వహించనున్న పవన్
* ప్రకాశం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం మొదటి సోమవారం సందర్బంగా భక్తులతో కిటకిటలాడుతున్న పలు శైవాలయాలు.. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణ తో మారుమోగిన శైవాలయలు.. దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్న మహిళా భక్తులు..
* ప.గో: పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరో భాగా నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి క్యూలైన్‌లో బారులు తీరిన భక్తులు.. స్వామివారికి అభిషేకాలు దీపారాధనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం హాజరుకానున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ , మంత్రులు సత్యకుమార్, సవిత. జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఇంఛార్జ్ మంత్రి అనగానిసత్యప్రసాద్.
* పశ్చిమగోదావరిజిల్లా: కార్తీక మాసం మొదటి సోమవారం వశిష్ట గోదావరి వలందరు రేవులో వేకువ జాము నుండి పుణ్యస్నానాలు ఆచరించి అమరేశ్వర, కపిల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు..
కడప : రేపు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి సవిత కడప కు రాక… జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి ఆమె జిల్లాలో పర్యటన… రేపు కడప కలెక్టరేట్ లో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం లో పాల్గొననున్న మంత్రి… ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో భేటీ అయ్యే అవకాశం….
* అల్లూరి జిల్లా: ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు… దట్టంగా కురుస్తున్న పొగ మంచు… పాడేరు లో 16, మినుములురు వద్ద 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు…
* శ్రీ సత్యసాయి : ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు పరిగి చెరువుకు వరద నీరు. నిండిన పరిగి చెరువు. గంగపూజ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత
* అనంతపురం : గుంతకల్లు లోని శంకరనద గిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఎస్కేయూనివర్శిటీ పరిధిలోని అంతర్ కళాశాలల మహిళ క్రీడాపోటీలు ప్రారంభం.
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,489 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28,871 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు
* తిరుపతి: కాళహస్తి ఆలయంలో రేపు నాగుల చవితి వేడుకలు…
* విశాఖ: నేడు అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన… బంగారమెట్ట గ్రామంలో దీపం 2.0 కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. సుండ్రు పుట్టులో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమంలో పాల్గొంటారు. కుమ్మరి పుట్టు గిరిజన సంక్షేమ పాఠశాలలో కిషోరి వికాశం కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని సమీక్ష నిర్వహిస్తారు.
* కర్నూలు: ఉల్లి మార్కెట్ ను సందర్శించనున్న ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు.. ఉల్లి అమ్ముకోలేక పడిగాపులు కాస్తున్న రైతులు.. ఉల్లి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు 9 గం.లకు మార్కెట్ కు వెళ్లనున్న మంత్రి నిమ్మల
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి క్షేత్రంలో కార్తీక మాస తొలి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు.
* అనంతపురం : తాడిపత్రి లో కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. స్వామి వారి దర్శనానికి బారులు తీరినా భక్తులు.
* శ్రీకాకుళం: కార్తీకమాస మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా శ్రీ ఉమారుద్ర కొటీశ్వరాలయం , శ్రీముఖలింగేశ్వరం , శ్రీ ఎండల మల్లికార్జున దేవాలయం సహా శైవ క్షేత్రాలకు పోటెత్తినభక్తజనం.
* కర్నూలు: నేడు కప్పట్రాళ్ళ యురేనియం కీలక సమావేశం.. కప్పట్రాళ్లలో సమావేశమంటూ ముందుగా ప్రకటించిన అధికారులు.. వ్యూహాత్మకంగా దేవనకొండ లో సమావేశం.. కప్పట్రాళ్లకు 2వ తేదీ వేళా సంఖ్యలో జనం తరలి వచ్చి ఆందోళనకు దిగడంతో దేవనకొండలో సమావేశం.. సమావేశానికి కప్పట్రాళ్ల, సమీప గ్రామాల ప్రతినిధులు రావాలని పిలుపు
* అమరావతి: ఇవాళ ఏపీలో టెట్ ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి లోకేష్.. 3,68,661 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షకు హాజరు.. అక్టోబరు 3 నుంచీ 21 వరకూ జరిగిన టెట్ పరీక్షలు
* విజయవాడ: కార్తీకమాసం మొదటి సోమవారం కావటంతో దుర్గా ఘాట్ లో భక్తుల పుణ్య స్నానాలు.. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
* నేడు విజయవాడలో శాప్ కార్యాలయంలో జరిగే శాప్ సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* కాకినాడ: నేడు పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం.. గొల్లప్రోలులో మీడియా సమావేశం
* అనంతపురం : రేపు పోలీసు శిక్షణ కళాశాలలో 2023 బ్యాచ్ కు చెందిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్. హాజరు కానున్న హోం శాఖమంత్రి అనిత , డీజీపీ ద్వారకా తిరుమలరావు.
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో నాగుల చవితి పర్వదినం.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి