AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసిందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు అంగీకారం తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. అయితే, గత ప్రభుత్వ హయాంలో 20 డిసెంబర్ 2023 నుండి 10 జనవరి 2024 వరకు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు కేజీబీవీలలో పని చేసే ఉద్యోగులు.. ఇక, ఈ సమ్మె తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచుతూ జనవరి 2024లో ప్రభుత్వం మెమో విడుదల చేసింది.. 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం మేర పెంచారు..
Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
అయితే, 21 రోజులు సమ్మె కాలానికి గానూ వేతనం చెల్లించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ని కోరారు సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్.. దీనికి మంత్రి నారా లోకేష్ అంగీకారం తెలిపారు.. అ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు విడుదల చేస్తూ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ – బీజేపీ కూటమి ప్రభుత్వం..