ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అయ్యింది.. ఏపీ ఐఐసీ కార్యాలయానికి ఒకే కారులో వచ్చారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది..
తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో ఎన్నడూ చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి. పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు. అంతే కాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా... పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు, ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి.
నవంబర్ 29. నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ చరిత్రలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ఉద్యమ పథంలో... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రోజు. 2009లో అదే రోజున ఆయన దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించడం తెలిసిందే. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్. నవంబర్ 29ని దీక్షా దివస్గా ప్రకటించి కార్యక్రమాలు…
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చుఏసింది.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, పోలీసులు, న్యాయవాది. .. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అఫిడవిట్లో సీఐడీ పేర్కొంది..
ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది..
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు.. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది.. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.. 2024 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్ల జారీ అంశంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రతిష్టాత్మక "స్కోచ్" అవార్డు వరించింది.. సంస్ధ తరఫున స్కోచ్ అవార్డును అందుకున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు.. బస్సులలో డిజిటల్ పద్ధతిలో టికెట్ల జారీ అంశంలో స్కోచ్ అవార్డు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది..
డీప్ ఫేక్లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురారావాలని.. డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ఏఐ నిపుణులు నవంబర్ 29న నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.