Minister Nara Lokesh: రెడ్ బుక్‌లో పెట్టిన పేర్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గతంలో గన్నవరంలో ఓ దళితుడిని కిడ్నాప్ చేసి టీడీపీ ఆఫీస్ మీద కేసులు విత్ డ్రా చేయించిన వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు లోకేష్. ఆ కేసుల వల్లే మాజీ శాసనసభ్యుడు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయన్నారు. న్యాయబద్దంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం వచ్చారు. ఐతే తమ స్టైఫండ్ గురించి వెటర్నరీ జూనియర్ డాక్టర్లు ఆయనకు వినతిపత్రం అందిచారు.
Read ALso: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కి గన్నవరం విమానాశ్రయంలో స్టైఫండ్ గురించి వినతిపత్రం అందజేశారు వెటర్నరీ జూనియర్ డాక్టర్లు.. వెటర్నరీ జూనియర్ డాక్టర్లకు స్పందించిన మంత్రి నారా లోకేష్… 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు… ప్రతిపక్షంలో నేతలు మా నాయకులు మేము ప్రజల తరఫున పోరాడాలని మేము వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.. ప్రతిపక్ష నేతని ఇంటి నుండి బయట రాకుండా గేట్లు తాడులతో బంధించిన విషయం తెలిసిందే.. గత ప్రభుత్వంలో మేము వారు చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే, మాపై దాడి చేసి కేసులు పెట్టారు.. గన్నవరం దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేశారు.. మేం ఆరోజుల్లోనే 19 బహిరంగ సభల్లో ప్రజలందరికీ రెడ్ బుక్కు చూయించా మని గుర్తుచేశారు..