సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన…
వికసిత భారత్లో భాగమే స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. సైబరాబాద్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే, వేములలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
ఆంధ్రప్రదేశ్లో పోరుబాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, అందులో భాగంగా.. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ.. రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పెట్టుబడి, గిట్టుబాటు ధర.. ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తోందని మండిపడుతున్నారు.. అయితే, పలు చోట్ల…
రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 40 డిపార్ట్మెంట్ లు పనితీరు, చేయాల్సిన పనులపై సమీక్షించారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికలతో పని చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది.. ప్రభుత్వం చేసినపాలసీలు, డిపార్ట్మెంట్ ల వారీగా తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.. సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్నింటికి పరిష్కారా దిశగా సూచనలు చేశారు. కొందరు అధికారుల, కొన్ని డిపార్ట్మెంట్ ల పని తీరుపై సీరియస్గా స్పందించారు..…