అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో నిద్రిస్తున్న వికలాంగుడిని అత్యంత దారుణంగా తగల పగలగొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే, ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతిరిపట్ల ఆ వికలాంగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ కోపంతో కువైట్ నుంచి వచ్చి.. చంపి అక్కడి నుంచి తిరిగి కువైట్ కి వెళ్లినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.
వైసీపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్నారు అవంతి.. సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రొడ్డెక్కడం సరైనది కాదని హితవు చెప్పారు.. బ్రిటీష్ ప్రభుత్వం తరహాలో తాడేపల్లిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేయమని చెప్పడం కరెక్ట్ కాదన్న ఆయన.. ఎన్నికలు అయిన ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ కేడర్ రొడ్డెక్క మనడం కరెక్ట్ కాదన్నారు.
వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగిలింది.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజీనామా లేఖ రాశారు అవంతి శ్రీనివాస్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్..
శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో అర్ధరాత్రి సమయంలో మాక్ డ్రిల్ నిర్వహించింది.. రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి.. చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది