రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్పై సస్పెండ్ వేటు పడింది.. ఈ నెల 8వ తేదీన నైట్ డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించినట్టు.. ఆ మహిళా హోంగార్డు ఆరోపిస్తోంది..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
టూరిజంపై ఫోకస్ పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో టూరిజం శాఖపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పీపీపీ మోడ్ లో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను పిలుస్తున్నాం అన్నారు.. PPPలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు..
అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు..
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గ్రంధి శ్రీనివాస్.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు.
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్వాగతం…