నేడు కోనసీమకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు.. ఇక, బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఏవైనా సెలవులు, ఆదివారం వచ్చినా.. ముందు రోజే మెజార్టీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు.. ఇక, జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్.. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం..
అరగుండు గీయించుకున్న జగన్ వీరాభిమాని.. ఎందుకంటే..?
స్నేహితులతో పందెం కట్టి ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని.. అరగుండు గీయించుకున్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన వీరవల్లి శివ రామకృష్ణ అలియాస్ శివ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వీరాభిమాని.. అయితే, స్నేహితులతో కట్టిన పందెంతో అరగుండు గీయించుకున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారిపోయింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే తాను అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం వేశాడట శివ.. ఇక, వైసీపీ ఓడిపోవడం.. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో శివను ప్రశ్నించారట స్నేహితులు.. ఎన్నికలకు ముందు నువ్వు చేసిన ఛాలెంజ్ సంగతి ఏంటి అంటూ స్నేహితులు ప్రశ్నించడంతో, ఇచ్చిన మాట ప్రకారం అరగుండు గీయించుకున్నాడు శివ.. వైఎస్ జగన్ వీరాభిమానిగా ఉన్న శివ.. వైసీపీ ఓడిపోవడంతో.. స్నేహితులతో వేసిన పందెం కోసం అరగుండు గీయించుకున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు.. అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను స్నేహితులతో కలిసి జరుపుకోవాలని భావించాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. జయంత్ గౌడ్ తో ఆ మద్యం బాటిల్ తమకు ఇవ్వాలని గొడవకు దిగారు. అయితే అప్పటికే మద్యం సేవించి ఉన్న జయంత్ గౌడ్ అతని ఫ్రెండ్స్ దుండగులతో వాగ్వాదానికి దిగారు. జయంత్ తో పాటు 8 మంది స్నేహితులు కలిసి మద్యం సేవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి దుండగులు జయంత్ పై కత్తులతో దాడి చేశారు. దాడిలో జయంత్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.
‘అమెరికా భవిష్యత్తు చైనా నాసిరకం ఉక్కుపై ఆధారపడి ఉండదు’.. ఉక్కు దిగుమతులపై 50% సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసే ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుత 25 శాతం నుంచి సుంకం రేటును 50 శాతానికి పెంచారు. అమెరికన్ ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించడమే ఈ సుంకం లక్ష్యం అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్-ఇర్విన్ ప్లాంట్‌లో మాట్లాడుతూ, సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించి, అమెరికన్ తయారీని పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘మేము ఉక్కు దిగుమతులపై సుంకాన్ని 25% పెంచబోతున్నాం. అమెరికాలో ఉక్కుపై సుంకాన్ని 25% నుంచి 50%కి తగ్గించబోతున్నాం, ఇది మన దేశంలో ఉక్కు పరిశ్రమను మరింత సురక్షితంగా చేస్తుంది.’ చైనాను లక్ష్యంగా చేసుకుని, అమెరికా భవిష్యత్తును ‘షాంఘై నుంచి చౌకైన ఉక్కు’పై ఆధారపడకుండా ‘పిట్స్‌బర్గ్ బలం, గర్వంతో’ నిర్మించాలని ట్రంప్ తెలిపారు.
టర్కీకి భారత్ మరో దెబ్బ… టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం రద్దు.. ఇండిగోకు కీలక ఆదేశాలు
ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం టర్కీకి షాకుల మీద షాకులిస్తోంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ-సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తగిలేలా చేసింది భారత్. ఇండిగో ‘డమ్ప్ లీజు’ ఒప్పందాన్ని ఆగస్టు 31, 2025 నాటికి రద్దు చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ప్రస్తుతం, ఇండిగో టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి డంప్ లీజుకు రెండు బోయింగ్ 777-300ER విమానాలను తీసుకొని ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్‌కు విమానాలను నడుపుతోంది. వాస్తవానికి ఈ లీజు గడువు మే 31న ముగియాల్సి ఉండగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ దానిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ లీజును 6 నెలలు పొడిగించాలని ఇండిగో కోరింది. కానీ DGCA దానిని తిరస్కరించింది. తదుపరి పొడిగింపు ఇవ్వబడదని, ఇది చివరి అవకాశం అని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
శ్రీలీల ఎంగేజ్ మెంట్..? ఫొటోలు వైరల్..!
యంగ్ బ్యూటీ శ్రీలీల షాకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తున్నాయి. ఇవి చూస్తుంటే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ అంతా షాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోలు చూస్తుంటే ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగానే ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చెంపలకు కొందరు పసుపు పెడుతున్నారు. ఇందులో శ్రీలీల పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోల కింద.. ‘నాకు ఈ రోజు బిగ్ డే’ అంటూ రాసుకొచ్చింది. పూర్తి వివరాలు త్వరలోనే చెబతాను అంటూ ‘కమింగ్ సూన్’ అంటూ రాసుకొచ్చింది. ఇవన్నీ చూసిన ఆమె ఫ్యాన్స్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుందేమో అని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కావేమో.. ఏదైనా యాడ్ కు సంబంధించిందేమో అని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో అవి కొత్త సినిమాకు సంబంధించినవేమో అంటూ చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలీల చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట రచ్చకు దారి తీసింది. శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రవితేజతో మూవీ చేస్తోంది. అటు తమిళంలో కూడా రెండు సినిమాలకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నడుమ ఆమె నటించిన సినిమలు అన్నీ దాదాపు ప్లాపే అవుతున్నాయి. మరి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.
‘వీరమల్లు’ టికెట్ ధరలకు తెలంగాణలో లైన్ క్లియర్..?
పవన్ కల్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. అయితే టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తెలంగాణలో టికెట్ రేటుపు రూ.250 వరకు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలగాణలో టికెట్ రేట్లను ఎక్కువ పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్స్ క్లోజ్ చేసేసింది. టికెట్ రేట్లను కూడా భారీగా పెంచుకోవడాన్ని తగ్గించేసింది. బడ్జెట్ మరీ ఎక్కువ ఉంటే ఎంతో కొంత వరకు మాత్రమే పెంచుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది. ఇప్పుడు వీరమల్లుకు కూడా ఒక వారం వరకు ఈ పెరిగిన ధరలు అమలు అయ్యేలా కనిపిస్తోంది. వారం తర్వాత సాధారణ రేట్లు ఉండబోతున్నాయి. అటు ఏపీలో మాత్రం ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని ఇప్పటికే పవన్ సూచించారు. ఆ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాడంట ఏఎం రత్నం. ప్రస్తుతానికి ఫిలిం ఛాంబర్ ద్వారా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దానికి గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. అయితే ఏపీలో కాస్త ఎక్కువగానే పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.