పార్లమెంట్లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు..
వైఎస్ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నారు వైఎస్ సునీత.. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా.. ఇంత అన్యాయం జరిగినా.. నాకు న్యాయం జరగలేదన్నారు.. అయినా, న్యాయపోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత.. నిందితుల కంటే మాకు, మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..
వివిధ అంశాలపై ఇప్పటికే ఎన్నో సార్లు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ అంటూ ఓ లేఖ రాశారు.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారు.. పరిపాలన సౌలభ్యం కోసం ఆఫీసులు, శాసనసభ, శాసనమండలి,…
హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్... భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
అమెరికాలో కారుపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యారు.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండం గోవిందపురం పంచాయతీకి చెందిన మోహన్ సాయి.. అమెరికాలోని మెమ్సిస్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే, గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ ఘటనలో మోహన్ సాయి కుడి భుజం, చేతిపై బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు మోహన్ సాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్‌స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు..