స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే... వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది
ఏపీ ప్రజా ప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు చెప్పింది.. ఇప్పటి వరకు వారానికి నాలుగు రోజులు మాత్రమే సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటున్న టీటీడీ.. ఇకపై ఏపీ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సిఫార్సులేఖలపై ఆదివారం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్... ఈ మధ్య పార్టీ విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజా.. కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే డైరెక్ట్ అటాక్ చేస్తూ... అయామ్ ఫైర్.. అయామ్ ది ఫైర్ అంటున్నారట. నన్ను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారు, ఏం.. ఉండనీయదల్చుకోలేదా అంటూ పబ్లిక్‌గానే ప్రశ్నిస్తున్నారాయన.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈనెల 15వ తేదీన…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.. అయితే, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్ కి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..