వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు మార్చి 18తో ముగుస్తుంది.
అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులకు ఎంతో నమ్మకం.. రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.. కార్తీక మాసం పర్వదినాలలో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.. అయితే, అన్నవరం సన్నిధిలో అపచారం జరిగింది.. స్వామివారికి సంబంధించిన సత్య నికేతన్ సత్రంలో మందు బాటిల్స్ కనిపించాయి..
పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు..
తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. ఈ సారి కూడా కేబినెట్ ముందు కీలక అంజెండా ఉంది.. సీఆర్డీఏ ఆథారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్ల గాను పనులు చేపట్టేందుకు అమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సీఆర్డీఏ.. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081…
ఉమ్మడి కర్నూలు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా మారుతున్నాయా అంటే.. అవును అనే విధంగానే ఆరోపణలు, విమర్శలు.. కౌంటర్లు, కౌంటర్ ఎటాక్లు నడుస్తున్నాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బైరెడ్డి సిధార్థ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆడదాం ఆంధ్ర పై విచారణకు అదేశించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.
రుమలలో ఉన్న వ్యవస్థను స్వయంగా పరిశీలన జరిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.. ముందుగా నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్ల వద్దకు చేరుకున్న ఆయన.. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను పరిశీలన జరిపారు.
అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు..