* నేడు వింబుల్డన్ ఉమెన్స్ ఫైనల్‌లో తలపడనున్న అనిసిమోవా, ఇగా స్విటెక్.. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్
* విశాఖ: నేడు 16వ విడత రోజ్ గార్ మేళా.. విశాఖ నుంచి పాల్గొంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
* కాకినాడ: నేడు ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనున్న రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ
* అనంతపురం : నేడు గుంతకల్లులో పర్యటించినున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.
* తిరుపతి: నేడు ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ 20వ ఆవిర్భావ దినోత్సవం.. హాజరుకానున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి… ఇతర స్దానిక ప్రజాప్రతినిధులు
* అన్నమయ్య జిల్లా : నేడు సౌమ్య నాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్య నాథ స్వామి రథోత్సవం ..
* కర్నూలు: పత్తికొండలో సీపీఐ మహాసభలు.. పాల్గొననున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
* విజయవాడ: గుడివాడలో నేడు బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమం.. హాజరుకానున్న మాజీ మంత్రి కొడాలి నాని
* విజయవాడ: నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు రావాలని విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు.. ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. ఇవాళ రెండోసారి హాజరు కానున్న విజయసాయి రెడ్డి
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 3 గేట్ల ద్వారా నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,37,635 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* తిరుమల: 15వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. 16వ తేది ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్ప పల్లకిలో ఉరేగునున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఈ సందర్భంగా 15,16వ తేదీలలో సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,217 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 31,155 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు
* నిర్మల్: నేడు జిల్లాలో మంత్రులు కొండా సురేఖ, జి.వివేక్ పర్యటన. బాసర సరస్వతి ఆలయం వద్ద పరిపాలన భవనం, టీటీడీకి చెందిన వంద గదులను ప్రారంభించనున్న మంత్రులు.. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీ లో వనమహోత్సవం లో పాల్గొననున్న ఇద్దరు మంత్రులు
* కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. పూర్తి స్థాయి నీటి మట్టం 700Fts (213.36Mts), ప్రస్తుత నీటి మట్టం 693.900 Fts. (211.501 Mts).. ఇన్ ఫ్లో 1,889 క్యూసెక్కులు..
* ఖమ్మం: నేడు కొనిజర్ల మండలం అంజనాపురంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
* ఏలూరు: పోలవరం వద్ద గోదావరి వరద ఉదృతి.. ప్రాజెక్టు 48గేట్ల నుంచి 6,40,047. క్యూసెక్కుల వరద ప్రవాహం.. స్పిల్‌వే ఎగువన 30.860 మీటర్ల నీటిమట్టం..
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఇన్ ఫ్లో 41,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 39,540 క్యూసెక్కులు, 10 గేట్ల ఎత్తివేత
* ఏలూరు: క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి వరద ఉదృతి.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ సూచన.. జిల్లా స్థాయిలో 1800 233 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. జంగారెడ్డిగూడెం ఆర్డివో ఆఫీసు 8309269056.. కుక్కునూరు తహశీల్దారు కార్యాలయం 8309246369.. వేలేరుపాడు తహశీల్దారు కార్యాలయం 8328696546 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన